Saturday, June 7, 2008

One More Corridor:: Hyderabad-Krishna-Deccan Corridor

హైదరాబాద్ మరియు మచిలీపట్నం మధ్య మరో కొరెడార్ - మేయ్టాస్ ప్లాన్


Wednesday, June 4, 2008

పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమం

చీరాలటౌన్, జూన్ 4 (ఆన్‌లైన్) : మ త్స్యకారుల జీవితాలకు ముప్పు గా మారిన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటును వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలుకానున్నాయి. సి.పి.ఐ. ఎం. ఎల్. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల 12న చీరాల వ్యతిరేక సదస్సులు నిర్వహిస్తున్నట్లు సి.పి.ఐ. ఎం.ఎల్. న్యూ డెమోక్రసీ నాయకులు బుధవారం స్థానిక గోలి సదాశివరావు కళ్యాణమండపంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.

న్యూ డెమోక్రసీ గుంటూరు, ప్రకాశం జిల్లా కార్యదర్శులు ట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎన్.బ్రహ్మయ్యలు మాట్లాడుతూ ని జాంపట్నం నుంచి మోటుపల్లి వరకు పారిశ్రామిక కారిడార్ పేరుతో ప్రభు త్వం అరబ్ఎమిరేట్‌కు చెందిన రసూల్ ఆల్ ఖిమా, మ్యాట్రిక్ సంస్థలకు గుంటూరులో 10వేల ఎకరాలు, ప్రకాశంలో ఎనిమిది వేల ఎకరాల భూమి కట్టబెట్టేందుకు పనిగా పెట్టుకుందని విమర్శించారు. విదేశీ పెట్టుబడుల కోసం మత్స్యకార గ్రామాలను ఖాళీ చే యించడం అన్యాయమన్నారు.

భూ ములు సేకరించడానికి జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి అవగాహన సదస్సుల పేరిట ఖాళీ చేయక తప్పదని బెదిరింపులు చేస్తున్నారన్నారు. మత్స్యకారులకు ఉపాధి, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పడం మోసపూరితమన్నారు. నె ల్లూరు జిల్లాలో అపాచి కంపెనీ ఏర్పాటైతే 35 వేల ఉద్యోగాలు ఇస్తామని చివరకు 3వేల ఉద్యోగాలిచ్చారని, వీరిలో కూడా 70 శాతం చెన్నైకి చెందిన వారన్నారు. అలానే పారిశ్రామిక కారిడార్‌లలో కూడా స్థానికులకు అవకాశం ఇవ్వరన్నారు. ప్రజల జీవనోపాధిని దెబ్బతిసే కోస్తా కారిడార్‌ను అందరూ వ్యతిరేకించాలన్నారు.

బహుళజాతి సంస్థలకు వేలాది ఎకరాలు కట్టబెట్టేది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రమేనన్నారు. మత్స్యకారుల బతుకులను చిన్నాభిన్నం చేసే కారిడార్‌కు వ్యతిరేకంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని మత్స్యకార గ్రామస్తులతో చీరాలలో ఈ నెల 12న కారిడార్ వ్యతిరేక ఉధ్యమాలను నిర్వహిస్తున్నట్లు సి.పి.ఐ ఎం.ఎల్ న్యూ డెమోక్రసి నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో అఖిలభారత రైతుకూలి సంఘం జిల్లా కార్యదర్శి కొంగర నరసింహం, మే కల ప్రసాద్, పద్మ, యేసమ్మ, శ్రీను, సుధాకర్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.